
క్రీడలు

ప్రముఖ కవి, రచయిత, ప్రజాగాయకుడు అందెశ్రీ ఆకస్మిక మరణంపై తెలంగాణ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతం రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ప్రజల్లో చైతన్యం రగిలించాయని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి తదితరులు అందెశ్రీ మరణాన్ని తెలంగాణ సాహిత్య ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!