
జనరల్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 2026–2028 కాలానికి నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సంస్థ అధ్యక్షుడిగా రాజ్ అల్లాడను ఎంపిక చేసింది. సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడం, సభ్యులతో అనుబంధాన్ని బలోపేతం చేయడం, సంస్థ అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం తెలిపింది.
న్యూజెర్సీకి చెందిన రాజ్ అల్లాడ 2009 నుంచి సంఘానికి సేవలందిస్తున్నారు. పలు బాధ్యతలు నిర్వర్తిస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వ నైపుణ్యం, సేవా దృక్పథం, అంకితభావాన్ని గుర్తించి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు సంఘం వెల్లడించింది. కొత్త కార్యవర్గం ఆధ్వర్యంలో సంస్థ మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతుందనే ఆశాభావం వ్యక్తమైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!