
సినిమాలు

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్ విద్యార్థులకు శుభవార్త ప్రకటించింది. రానున్న పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది. గత ఏడాది అమలు చేసిన సడలింపును ఈసారి కూడా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేదా అనివార్య కారణాల వల్ల విద్యార్థులు పరీక్షను కోల్పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది. అయినప్పటికీ విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!