

ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో అభివృద్ధి చేయబోయే ఆరు ప్రాంతీయ విమానాశ్రయాల్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటిగా గుర్తించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం, ఆదిలాబాద్లో విమానాశ్రయం నిర్మాణం సాధ్యమని నిర్ధారణకు వచ్చింది. దీనిని అనుసరించి భూమి స్వాధీన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలంటూ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. మొత్తం 700 ఎకరాల భూమిని జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్గా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ను ప్రభుత్వం, AAI, సివిల్ ఏవియేషన్ శాఖలు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లనున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ను అమలు చేయనున్నారు.










కామెంట్స్ (1)
Happy to see this project approved!