
న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను సాధారణ మరియు ఐచ్ఛిక సెలవుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తాయి.
సాధారణ సెలవుల్లో భోగి, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం, మహాశివరాత్రి, హోలి, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి, బక్రీద్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం, ఈద్ మిలాద్, కృష్ణాష్టమి, వినాయక చవితి, గాంధీ జయంతి, సద్దుల బతుకమ్మ, విజయదశమి, దీపావళి, కార్తీక పౌర్ణమి, క్రిస్మస్ వంటి పండుగలు ఉన్నాయి. అలాగే రంజాన్, విజయదశమి, క్రిస్మస్ పండుగల మరుసటి రోజును కూడా ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది.


.png&w=3840&q=75)














.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
Good info!