

రాష్ట్రంలో పెట్టుబడుల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్ల కాలంలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.8.81 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, కుదుర్చుకున్న ఎంవోయూలను (MoUs) త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడానికి వీటి అమలు బాధ్యతలను ప్రభుత్వం 'స్పీడ్' విభాగానికి అప్పగించింది. పెట్టుబడిదారులకు, ప్రభుత్వ శాఖలకు మధ్య సమన్వయం కోసం మరియు పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక రియల్ టైమ్ డాష్ బోర్డును రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రతి శాఖలో ఒక 'సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' (SPOC) అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ అధికారులు ఆయా శాఖల పరంగా ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తూ, పెట్టుబడులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా పర్యవేక్షిస్తారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!