
సినిమాలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. నేడు సాయంత్రానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి చేరుకోనుండగా, రేపు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ మరియు ప్రభుత్వ అంశాలపై సమీక్ష చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై నుంచి మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి చేరుకోనుండగా, రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. రెండేళ్ల పాలనపై సమీక్ష, మంత్రుల మధ్య సమన్వయం, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, నామినేటెడ్ మరియు పార్టీ పదవుల భర్తీ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!