
బిజినెస్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఆదివారం (మార్చి 8) నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 16న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మరుసటి రోజు చర్చ జరగనుంది. ఇక 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మార్చి 20న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!