

విజయ్ దేవరకొండ హీరోగా, శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం హైదరాబాద్‌లో సంప్రదాయ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ ముహూర్తపు షాట్‌కు నాని క్లాప్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైరా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.
ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తోంది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాలౌట్ వంటి ప్రాజెక్ట్‌లలో పనిచేసిన అలెహాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్‌మాన్ ఫరెవర్ సినిమాలకు పనిచేసిన ఎరిక్ డర్స్ట్ వీఎఫ్ఎక్స్ బాధ్యతలు చేపట్టారు. హేషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మిథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌తో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతోంది.





















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!