
సినిమాలు

వీధి కుక్కల సమస్యపై మరియు కుక్క కాట్ల ఘటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్క కాటుతో ఎవరికైనా గాయమైతే లేదా మరణిస్తే, ఆ కుక్క యజమానిదే పూర్తి బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయరాదని, తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది.
వీధి కుక్కల సమస్యపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రజల భద్రత అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో నిర్లక్ష్యం సహించబోమని కోర్టు పేర్కొంది.
అలాగే, కుక్క కాటుతో ఎవరు మరణించినా, వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ప్రజల భద్రతపై ప్రభుత్వాల బాధ్యతను సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!