
.webp&w=3840&q=75)
మతం మారితే షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహా ఇతర మతాల్లోకి మారినవారు ఎస్సీ కేటగిరీలోకి రారని పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.
రాజ్యాంగంలోని 1950 ఉత్తర్వుల ప్రకారం క్లాజ్-3లో పేర్కొన్న మతాలు తప్ప ఇతర మతాలను స్వీకరిస్తే ఎస్సీ హోదా ఆటోమేటిక్‌గా రద్దవుతుందని కోర్టు వెల్లడించింది. మతం మార్చుకుని మరోవైపు ఎస్సీ హక్కులు పొందాలని కోరుకోవడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పనిచేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
తిరిగి సొంత మతంలోకి రావాలంటే కొన్ని కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. సంబంధిత కులానికి చెందినవాడని నిరూపించడం, మారిన మతాన్ని పూర్తిగా విడిచిపెట్టినట్లు ఆధారాలు చూపడం, అలాగే ఆ కులం తిరిగి అంగీకరించినట్లు ధృవీకరణ ఉండాలని సూచించింది. ఈ తీర్పు మత మార్పు, రిజర్వేషన్ హక్కులపై కీలక ప్రభావం చూపనుంది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!