

మహిళా వ్యాపారవేత్తగా పేరొందిన, మాజీ డీజీపీ మనవరాలు దివ్యారెడ్డి సైబర్ మోసానికి గురయ్యారు. ఆమె 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనలో సైబర్ నేరగాళ్లు ఆమె పేరును, ఫొటోను దుర్వినియోగం చేస్తూ నకిలీ వాట్సప్ ఖాతా సృష్టించి, ఆమె అకౌంటెంట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నెల 13న ఆ ఖాతా నుంచి అకౌంటెంట్‌కు మెసేజ్ పంపిస్తూ తాను మీటింగ్‌లో ఉన్నానని పేర్కొని, సూచించిన బ్యాంక్ ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ సందేశాన్ని నమ్మిన అకౌంటెంట్ పేర్కొన్న మొత్తాన్ని పంపించారు.
తదుపరి ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలని అదే విధంగా వాట్సప్ ద్వారా సందేశం రావడంతో అకౌంటెంట్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెక్ అప్రూవల్ కోసం నేరుగా డైరెక్టర్ దివ్యారెడ్డిని సంప్రదించగా, గతంలో జరిగిన రూ.1.20 కోట్ల లావాదేవి గురించి వివరించారు. దీనిపై స్పందించిన దివ్యారెడ్డి తాను ఎలాంటి డబ్బు పంపమని సూచించలేదని స్పష్టంగా తెలియజేశారు. దీంతో మోసం జరిగిన విషయం బయటపడింది. ఈ ఘటనపై బాధితులు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!