

ప్రభుత్వ ఖర్చుతో పోలీసు భద్రత కల్పించడం అవసరమా అని ప్రశ్నిస్తూ, వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి సుప్రీంకోర్టు ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తన 2+2 భద్రతను తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసు భద్రత ప్రస్తుతం హోదాగా మారుతోందని, ముప్పు ఆధారంగా మాత్రమే భద్రత కల్పించాలే గానీ రాజకీయ హోదా ఆధారంగా కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది గతంలో కుటుంబ సభ్యులపై జరిగిన హత్యలు, బెదిరింపులను ప్రస్తావిస్తూ భద్రత అవసరమని వాదించినప్పటికీ, న్యాయమూర్తులు ఆ వాదనలను అంగీకరించలేదు. ముప్పు అంచనా నిఘా సంస్థల సమాచారం ఆధారంగా శాస్త్రీయంగా నిర్ణయించబడుతుందని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయని కోర్టు పేర్కొంది. రాజకీయ పార్టీ సభ్యత్వం మాత్రమే భద్రతకు కారణం కాదని స్పష్టం చేస్తూ, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర పోలీసు యంత్రాంగానిదేనని సుప్రీంకోర్టు తెలిపింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!