

అర్హులైన ఓటర్లుగా నిరూపించుకోవడానికి పదో తరగతి ప్రవేశ పత్రం (అడ్మిట్ కార్డు), ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలను అనుబంధ పత్రాలుగా ఎన్నికల అధికారులకు సమర్పించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఓటరు నమోదు దరఖాస్తుల్లో ఉన్న వ్యత్యాసాలను పరిష్కరించేందుకు విద్యాసంబంధిత పత్రాలను అనుబంధ ఆధారాలుగా పరిగణించవచ్చని తెలిపింది.
ఇప్పటికే దాదాపు 80 లక్షల క్లెయిమ్‌ల పరిష్కారం కోసం జిల్లా మరియు అనుబంధ న్యాయమూర్తులను నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించిన ధర్మాసనం, అవసరమైతే ఝార్ఖండ్ మరియు బిహార్ రాష్ట్రాల న్యాయాధికారుల సహకారం కూడా తీసుకోవాలని ఆదేశించింది. ఈ నెల 28తో సవరణ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో, గురువారం సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!