

సూపర్ స్టార్ రజనీకాంత్ – లతా రజనీకాంత్ దంపతులు ఈరోజు (శనివారం) తెల్లవారుజామున తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారితో పాటు కూతుళ్లు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ మరియు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తులాభారం ద్వారా స్వామివారికి మొక్కులు చెల్లించారు.
రజనీకాంత్ 72 కిలోల చక్కెర, బెల్లం, కలకండ, బియ్యం, నాణేలతో, లతా రజనీకాంత్ 82 కిలోలతో స్వామివారికి తులాభారం చెల్లించారు. ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి సవిత కూడా ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, దర్శనం అనంతరం రజనీకాంత్‌తో పాటు టీటీడీ సభ్యులతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చేరి ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. రజనీకాంత్ అభిమానులతో మాట్లాడి వారి క్షేమాన్ని ఆరా తీశారు.

ఇక నిన్న (శుక్రవారం) సూపర్‌స్టార్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కేకులు కట్ చేస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్-2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!