

తెలుగు ప్రజల పెద్ద పండగ సంక్రాంతి. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలాలకు చేరుకుని పండగను ఆనందంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన వీసా నిబంధనల కారణంగా ఈసారి అనేక మంది ప్రవాసాంధ్రులు స్వదేశానికి రాలేని పరిస్థితి నెలకొంది. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం కోసం అమెరికాలో ఉన్నవారిలో చాలామంది ప్రయాణం చేస్తే తిరిగి ప్రవేశం లభిస్తుందో లేదోనన్న ఆందోళనతో పండగను అక్కడే గడపాల్సి వస్తుంది.
అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, ఓపీటీపై పనిచేస్తున్న యువత, గ్రీన్ కార్డు కలిగిన ఉద్యోగులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. నిర్దేశిత గడువులోపు తిరిగి రావాలనే కంపెనీల హెచ్చరికలు, వీసా నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో పలువురు పండగ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘పరిస్థితిని అర్థం చేసుకోండి, రావాలని ఉన్నా రాలేకపోతున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి ఎప్పటికప్పుడు తోడ్పడే ప్రవాసాంధ్రులు ఈసారి దూరం నుంచే సంక్రాంతి శుభాకాంక్షలు పంపిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!