

ఆధ్యాత్మికం, చారిత్రకం, ఆహ్లాదం అనే మూడు విభాగాల్లో తెలంగాణలో పర్యాటకం విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక నిర్మాణాలను సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిరంతరం భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకు సగటున 40 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకుంటుండగా, 2025 జూన్ నెలలో అత్యధికంగా 20.06 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మొత్తం ఏడాదిలో 1.58 కోట్ల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు.
వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని 2025 ఆగస్టులో 18.75 లక్షల మంది దర్శించుకోగా, అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన బాసర జ్ఞానసరస్వతి ఆలయాన్ని మే, జూన్ నెలల్లో నాలుగు లక్షల మంది చొప్పున సందర్శించారు. తెలంగాణ పర్యాటక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టాప్-10 పర్యాటక ప్రదేశాల్లో తొలి మూడు స్థానాల్లో ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలే నిలిచాయి. హైదరాబాద్ జూపార్క్ నాలుగో స్థానంలో ఉండగా, గోల్కొండ కోట, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!