
గాసిప్స్

హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంటకల్ వాసులకు రైల్వే శాఖ మంచి వార్త చెప్పింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించారు.
ఫిబ్రవరి 2 నుంచి 27 వరకు ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్(06539) మధ్య 17 ప్రత్యేక ట్రిప్పులు, ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు బీదర్-ఎస్ఎంవీటీ బెంగళూరు(06540) మధ్య 17 ప్రత్యేక ట్రిప్పులు నడపబడతాయి.
ఈ రైళ్లు యెల్హంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంటకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణా, యాద్గిర్, వాడి, షాహబాద్, కలబురిగి, హమ్నాబాద్ స్టేషన్ల వద్ద ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!