
జనరల్

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ న్యాయస్థాన ప్రాంగణంలో ఓ కోతి చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. భూ నమోదు పనుల కోసం దాదాపు రెండు లక్షల రూపాయల నగదుతో వెళ్తున్న ఓ వ్యక్తి చేతిలోని సంచిని కోతి లాక్కొని సమీపంలోని వేపచెట్టుపైకి ఎక్కింది. అనంతరం సంచిని తెరిచి అందులోని ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను కిందికి విసరడం ప్రారంభించింది.
దీంతో న్యాయస్థాన ప్రాంగణంలో నోట్ల వర్షం కురిసినట్లుగా మారి, డబ్బు ఏరుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు. చివరకు సంచి తిరిగి లభించినప్పటికీ, అందులోని సుమారు నలభై వేల రూపాయలు కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!