

తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసు సిబ్బందికి పుట్టినరోజు మరియు పెళ్లిరోజు సందర్భంగా ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరం విధుల్లో ఒత్తిడితో పనిచేస్తున్న సిబ్బందికి కుటుంబంతో సమయం గడిపే అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితులు మినహా అన్ని విభాగాధికారులు ఈ సెలవులు తప్పనిసరిగా మంజూరు చేయాలని ఆదేశించారు.
ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తుక్కుగూడలో ఫ్యూచర్ సిటీ తాత్కాలిక కమిషనరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. శాశ్వత భవనం నిర్మాణం కోసం మీర్ ఖాన్పేట్లో 24 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న శివధర్ రెడ్డికి ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!