
_2K.png&w=3840&q=75)
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తెలిపారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన స్పష్టం చేశారు.
తనిఖీల్లో పట్టుబడిన వారికి వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా మరియు ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నేర తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని తెలిపారు.
బుధవారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను కమిషనర్ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తనిఖీల విధానం, సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు చేశారు. అలాగే, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!