
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఏపీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇండీ కూటమి పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించాలని ఎన్డీఏ నేతలకు సూచించారు.
కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నిరసనలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలపై విమర్శలు గుప్పించారు. “స్త్రీశక్తి” పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలకు న్యాయం చేయడంలో ఎన్డీఏ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.












.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!