
రాజకీయాలు

ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈరోజు తెల్లవారుజామున ఆకస్మిక అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున నుంచే ఆయనకు కడుపులో తీవ్ర నొప్పి ప్రారంభమైంది. నొప్పి తీవ్రత పెరగడంతో తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో వెంటనే చేర్చారు.
ప్రస్తుతం గవర్నర్కు ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అవసరమైన అన్ని వైద్య సేవలు కొనసాగుతున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.











.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!