

కేజీయఫ్ సినిమా సిరీస్ మొదటి రెండు భాగాలు కన్నడ సినీ పరిశ్రమను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాల కథ, యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే కేజీయఫ్ మూడో భాగం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు దాని ప్రారంభంపై స్పష్టత లేదు.
తాజాగా హీరో యశ్ ఈ విషయంపై స్పందించారు. కేజీయఫ్ 3 తప్పకుండా వస్తుందని కానీ అది త్వరగా మాత్రం కాదని చెప్పారు. ప్రస్తుతం తాను పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నానని, అందుకే ఈ సినిమా ఆలస్యమవుతోందని తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తరచూ మాట్లాడుతున్నానని, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే సినిమా ప్రారంభమవుతుందని చెప్పారు.
ప్రస్తుతం యశ్ మూడు పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న టాక్సిక్ సినిమా జూన్ 4న విడుదల కానుంది. అలాగే నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణంలో రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.








.jpeg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!