
క్రీడలు

థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ‘బ్యాండ్ మేళం’ సినిమా ఇప్పుడు ఓటిటి వేదికగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపళ్ళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం విడుదలకు ముందు మంచి బజ్ సంపాదించినప్పటికీ, థియేటర్ రన్లో ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంట్లో నుంచే చూసే అవకాశం ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది మంచి వినోదంగా మారే అవకాశం ఉంది. సతీష్ జివ్వాజి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లైట్ హార్ట్ ఎంటర్టైనర్గా నిలిచింది. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలవగా, కోన వెంకట్ నిర్మాణం ఆకర్షణగా ఉంది. ఓటిటిలో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.















.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!