
గాసిప్స్

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. 79 ఏళ్ల సోనియా గాంధీ ఆదివారం సాయంత్రం సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్త్మా, ఛెస్ట్ ఇన్ఫెక్షన్ మరియు ఇతర సమస్యల కారణంగా ఈ నెల 5 వ తేదీన ఆమె ఆస్పత్రిలో చేరారు.
వారం రోజుల పాటు ఛెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ అరుప్ బసు ఆమెకు చికిత్సలు అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను డిశ్చార్జ్ చేశామని, ఇకపై ఇంటి వద్దే వైద్యం తీసుకోవాలని సూచించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!