

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తన వివాహం రద్దయినట్లు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 23న జరగాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో ఆమె పెళ్లి రద్దయినట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు.

“గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితం చుట్టూ ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. గోప్యతను ఇష్టపడే వ్యక్తినైనా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. వివాహం రద్దయినట్లు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈ విషయంపై ఇక్కడితోనే ముగింపు పలకాలని కోరుకుంటున్నా. రెండు కుటుంబాల గోప్యతను గౌరవిస్తూ మాకు కాస్త స్పేస్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టేందుకు, దేశం తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడి ట్రోఫీలు సాధించేందుకు నా ప్రయత్నం కొనసాగిస్తా. నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ముందుకు సాగే సమయం వచ్చేసింది” అని స్మృతి స్టోరీలో రాసుకొచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!