

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 2024 మార్చి 14న జారీ చేసిన జీఓ నంబర్ 6 ద్వారా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయగా, దాన్ని రద్దు చేయాలని మరియు కమిషన్ నివేదికను కొట్టివేయాలని పిటిషనర్లు కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన లోపాలపై ఈ కమిషన్ విచారణ చేపట్టింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టీ. హరీశ్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ ఇరుపక్షాల వాదనలు విని మార్చి 12న తీర్పును రిజర్వు చేసింది. ఈ రోజు వెలువడనున్న తీర్పు తెలంగాణలో రాజకీయ, పరిపాలనా రంగాల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!