
సినిమాలు

ఇండోర్‌లో కొనసాగుతున్న నీటి సంక్షోభం నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసనీయమైన చర్య తీసుకున్నట్లు సమాచారం. నగరంలో నీటి కొరత, తాగునీటి నాణ్యతపై ఆందోళనలు నెలకొన్న సమయంలో, సుమారు రూ.3 లక్షల విలువైన అధునాతన వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను అక్కడికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
సురక్షితమైన, శుభ్రమైన తాగునీటిని అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ ప్యూరిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. నీటి సంరక్షణ, నాణ్యతపై అవగాహన పెంచేలా గిల్ చేసిన ఈ ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది. నీటి కొరత వంటి సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన చూపిన బాధ్యతాయుత వైఖరి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!