
గాసిప్స్

డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల ఘటనకు సంబంధించిన నిందితుడిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అతడిని 31 ఏళ్ల కోలో టామోస్ అలెన్‌గా గుర్తించారు. అతడు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ సమీప టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడని వెల్లడించారు.
అతడి విద్యా నేపథ్యం ప్రకారం, 2017లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. తరువాత కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ కూడా చేశాడు. గేమ్ డెవలప్మెంట్, టెక్నాలజీ ప్రాజెక్టుల్లో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఒక విద్యా సంస్థలో ట్యూటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ ఫెలోషిప్‌లో కూడా పాల్గొన్నాడు. రాజకీయంగా డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి.








.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!