

రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న చిత్రం రామాయణ. తాజాగా వచ్చిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. టీజర్ మిక్స్డ్ రెస్పాన్స్ పొందినా, సంప్రదాయ వేషధారణలో శాంత, గంభీర స్వభావంతో రణబీర్ రాముడి లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు.ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. 4000 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఆదిపురుష్ సినిమాపై మళ్లీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రభాస్ ధైర్యంగా మైథాలజికల్ జానర్లో అడుగుపెట్టడం ప్రశంసనీయమని ఆయన అభిమానులు అంటున్నారు.రామాయణ టీజర్లో కొందరు విజువల్స్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆదిపురుష్‌తో పోల్చి విమర్శిస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కోపానికి గురవుతున్నారు. గతాన్ని మళ్ళీ ఎందుకు తవ్వేదని మండిపడుతున్నారు. పోటీ ప్రపంచంలో విజయాలు అపజయాలు సర్వ సాధారణం అని, ఒక సినిమాని ప్రశంసించడానికి ఇంకో సినిమాని విమర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!