

అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన డెకాయిట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మితమైంది. నిర్మాతగా సుప్రియ యార్లగడ్డ వ్యవహరించారు.
అయితే ఇది అక్కినేని కాంపౌండ్ సినిమా కావడంతో, ఈ సినిమాపై సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అందరూ సెలబ్రిటీలు విషెస్ తెలపగా, సమంత విషెస్‌కు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యం వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా సమంత విషెస్ తో మరోసారి ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు సమంత పోస్ట్‌ను బాగా వైరల్ చేస్తున్నారు. ఈ నెల 10న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!