
సినిమాలు

గత నాలుగు రోజులుగా తీవ్ర ఎండలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ రోజు నుంచి 11 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 36–37 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా, హైదరాబాద్లో 34–35 డిగ్రీలు, ఇతర జిల్లాల్లో 35–36 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ నెల 16 నుంచి 23 వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో బలమైన ఉరుములు, మెరుపులు, వర్షాలు మరియు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కాలంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరుసగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. రైతులు ఈ వాతావరణ మార్పుల కారణంగా పంటలకు నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!