

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీబీఐ దర్యాప్తులో తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును అన్ని కోణాల్లో విచారించి, లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసింది. హర్యానాలోని ఐసీఏఆర్ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నిర్వహించిన శాస్త్రీయ పరీక్షల్లో పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆనవాళ్లు లేవని నిర్ధారణ అయింది.
సీబీఐ నాలుగు వేర్వేరు నెయ్యి నమూనాలను ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్ పరీక్షలకు లోబర్చగా, వాటిలో కొలెస్ట్రాల్ కూడా లేనట్టు వెల్లడైంది. జంతువుల కొవ్వులో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుందన్న నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఆరోపణలకు పూర్తిస్థాయి ఖండనగా మారింది. దర్యాప్తు పూర్తి చేసిన సీబీఐ, నెల్లూరులోని ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన దుష్ప్రచారం విఫలమైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!