
బిజినెస్

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించబడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై, వచ్చే నెల 5 వరకు కొనసాగుతుంది. వచ్చే నెల 6 న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, వచ్చే నెల 9 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. వచ్చే నెల 16 న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఏప్రిల్ 9 న ఖాళీ కానున్న రెండు స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో మొత్తం 37 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!