
గాసిప్స్

హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై భారీ వాహనాల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. టోల్ ప్లాజా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా నగరాల నుంచి సొంత ఊర్లకు వెళ్తున్న ప్రజలతో పాటు, ఏపీలో జరిగే సంప్రదాయ కోళ్ల పందాలను చూడటానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. నాలుగు రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో వాహనాలు ఏపీ వైపు వెళ్లడంతో పలు టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. ప్రజల పల్లెబాటతో రహదారులు పూర్తిగా రద్దీగా మారాయి.



.jpg&w=3840&q=75)










.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!