.webp&w=3840&q=75)

భారతదేశంలో గృహాలపై భారీ ఆర్థిక భారంగా మారుతున్న ప్రధాన సమస్యలలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల అధిక ఖర్చులు ఒకటి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు చిన్న చికిత్సలకైనా, ప్రాణాంతక చికిత్సలకైనా ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులు వాణిజ్య ప్రాతిపదికన నడుస్తుండటంతో చికిత్సలకు ఎలాంటి ధర పరిమితి లేకపోవడం మధ్యతరగతి మరియు పేద వర్గాలకు పెద్ద భారంగా మారుతోంది. దీంతో అనేక మంది వైద్య ఖర్చుల కోసం సోషల్ మీడియాలో ఆర్థిక సహాయం కోరుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైద్య సేవల్లో జరుగుతున్న అధిక బిల్లింగ్, పెరుగుతున్న ఖర్చులపై ఆందోళనల మధ్య కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక చర్యలు పరిశీలిస్తోంది. వైద్య పరికరాలు మరియు చికిత్సలపై హాస్పిటళ్లు వసూలు చేసే మార్జిన్లకు పరిమితి విధించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. సిరంజీలు, గ్లోవ్స్ వంటి తక్కువ ధర పరికరాల నుంచి పేస్‌మేకర్‌లు, హార్ట్ వాల్వ్‌లు వంటి ఖరీదైన పరికరాల వరకు ధర నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ చర్యల ద్వారా పారదర్శకత పెంచడం, ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడం, అలాగే ఆరోగ్య బీమా ప్రీమియంల పెరుగుదలను నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
.webp&w=3840&q=75)









.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!