
సినిమాలు

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజా కాలం ముగిసింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన అనంతరం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) వెల్లడించింది. మండల పూజ పూర్తితో ఈ ఏడాది దర్శనాల ప్రక్రియకు తాత్కాలికంగా ముగింపు పలికారు.
మకరవిళక్కు మహోత్సవం సందర్భంగా శబరిమల ఆలయాన్ని ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మండల–మకరవిళక్కు సీజన్లో ఇప్పటివరకు సుమారు 30 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోగా, ఆలయానికి రూ.333 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రకటించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!