

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ (55) మరణించారు. ఆయనకు 80 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స అందించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
సమ్మె భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్‌గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఆలస్యం జరుగుతోందని నిరసిస్తూ ఈ చర్యకు పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు మార్చారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.





.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!