

యువ నటుడు సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గోదారి గట్టుపైన సినిమా విడుదల తేదీ ఖరారైంది. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను కలిపి రూపొందించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సుభాష్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ చిత్రాన్ని మే 8 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ పోస్టర్లో పెళ్లి నేపథ్యం, భావోద్వేగ సంఘర్షణలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వధువు వేషంలో నిధి ప్రదీప్ సందిగ్ధ భావాలతో కనిపిస్తుండగా, సుమంత్ ప్రభాస్, జగపతి బాబు గంభీరమైన భావాలతో కనిపించడం కథలో సంబంధాల మధ్య ఉన్న తీవ్రతను సూచిస్తోంది.
ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ సంగీతం అందిస్తుండగా, సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ, ప్రవల్య ఆర్ట్ డైరెక్షన్, అనిల్ కుమార్ పి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నారు.














.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!