
.jpg&w=3840&q=75)
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ, మరణాల సంఖ్య తగ్గడం కొంత ఊరట కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, కూకట్పల్లి వంటి జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటం, ట్రాఫిక్ సిగ్నళ్ల ద్వారా నియంత్రణ, సగటు వేగం 23 కిలోమీటర్లకు మించకపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతోంది. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం వంటి భద్రతా నిబంధనలను వాహనదారులు పాటించడం కూడా ప్రాణాపాయ ఘటనలు తగ్గడానికి దోహదపడుతోంది.
అయితే సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో విశాలమైన రహదారులు, విస్తరిస్తున్న కాలనీలు, విద్యా మరియు ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండటంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఓఆర్ఆర్పై అనుమతించిన గరిష్ఠ వేగం 120 కిలోమీటర్లు అయినప్పటికీ, దానిని మించి ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది.
గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున 74 ప్రమాదాలు, 20 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు 5 శాతం పెరిగినా, మరణాలు మాత్రం అదే స్థాయిలో తగ్గాయి. 2025లో మొత్తం 1,366 ప్రమాదాలు పెరిగినా, మరణాలు 404 తగ్గాయి. ‘ఎరైవ్-ఎలైవ్’ వంటి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, బ్లాక్ స్పాట్లపై గస్తీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి, ట్రాఫిక్ విభాగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రోడ్డు ప్రమాదాలు మరింత తగ్గే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!