
సినిమాలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వరుస ఆగడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కట్ సమీపంలో కర్ణాటక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు కాగా, మరొకరు గాయపడ్డారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా, అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఇక నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఒక కారును ఢీకొట్టడంతో కారు పూర్తిగా ఛిద్రమైంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు రోడ్డు భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నాయని వారు పేర్కొన్నారు.











కామెంట్స్ (1)
Life is precious, drive safe