
సినిమాలు

జనసేన పార్టీ బొలిశెట్టి సత్యనారాయణతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన చేపట్టే కార్యక్రమాలు, వ్యాఖ్యలు పార్టీతో సంబంధం లేనివేనని అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది.
ఇటీవల విశాఖపట్నంలో పావురాల కొండలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
అదే విధంగా, గత కొంతకాలంగా కూటమిలో టీడీపీ చేస్తున్న అన్యాయాలపై కూడా బొలిశెట్టి విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జనసేన పార్టీ ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!