
గాసిప్స్

వెనెజువెలాపై అమెరికా దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని భారత్ స్పష్టం చేసింది.
వెనెజువెలాలో ఉన్న భారతీయులతో కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఎంఈఏ తెలిపింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది. వెనెజువెలాలో శాంతి, స్థిరత్వం నెలకొనాలంటే ఇరువర్గాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని భారత్ తన ప్రకటనలో కోరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!