
బిజినెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 37 కరువు మండలాల్లో అదనపు ఉపాధి రోజులు కల్పిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో 25 మండలాలు, అన్నమయ్య జిల్లాలో 9 మరియు ప్రకాశం జిల్లాలో 3 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.
ఈ మండలాలకు మరో 50 పనిదినాలు అదనంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో ఒక్కో కుటుంబానికి 50 అదనపు ఉపాధి రోజులు కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ అదనపు పనిదినాలు ఈ నెల 31లోపు వాడుకోవాలని స్పష్టంచేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!