
.webp&w=3840&q=75)
బంగారం తాకట్టు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన తాజా మార్గదర్శకాలతో సామాన్యులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఏడాదిలో వడ్డీ చెల్లిస్తే రుణ గడువును మరో ఏడాదికి పొడిగించేవారు. ఇప్పుడు ఏడాదిలోగా అసలు, వడ్డీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోతే రుణాన్ని ఎన్పీఏగా ప్రకటించి బంగారం వేలం వేస్తామంటూ బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకుని కొంతమంది ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దిగుతూ, బంగారాన్ని విడిపిస్తామని చెప్పి చివరకు రైతుల చేతిలోంచి బంగారాన్ని లాక్కుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ములకనూరు గ్రామానికి చెందిన రైతు ఎం.రాములు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసి రైతుల గోడును వివరించారు. పంటలు అమ్మిన తర్వాతే బకాయి చెల్లించే పరిస్థితి ఉంటుందని, అంతకుముందే వేలం వేస్తామనడం అన్యాయమని ఆయన ప్రశ్నించారు. అయితే బ్యాంకు అధికారులు మాట్లాడుతూ, నెలవారీ ఈఎంఐ విధానంలో కూడా బంగారు రుణాలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే అక్రమాలు, నకిలీ బంగారం తాకట్టు వంటి మోసాలను అడ్డుకోవడానికే బుల్లెట్ రీపేమెంట్ విధానంను ఆర్బీఐ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిందని స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!