

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ విషయంలో నాణ్యతపై ఎలాంటి రాజీ పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు విద్యార్థులకు ఈ కిట్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, కానీ నాణ్యత మాత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన సెంట్రల్ ప్రొక్యూర్మెంట్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో, యూనిఫామ్‌తో పాటు 21 అవసరమైన వస్తువులు విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్ తదితర వస్తువుల కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పూర్తి వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!