
న్యూస్

పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కొంతకాలంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల ఆందోళనకర సమాచారం వెలువడింది. కుడి కన్ను చూపులో సుమారు 85 శాతం కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ పాకిస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసి ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాజకీయ భేదాలు పక్కనపెట్టి మానవతా దృష్టితో తగిన వైద్య సహాయం అందించాలని వారు కోరినట్లు తెలుస్తోంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!