
బిజినెస్

ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న ఈ బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా, కంచికచర్ల మండలం కేసర టోల్గేట్ వద్ద బస్సు వెనుక ఇంజిన్‌లో నుంచి పొగలు రావడంతో ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రయాణికులంతా సురక్షితంగా బస్సు నుంచి దిగిపోయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!