
గాసిప్స్

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గోసేవలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఆవులకు పచ్చగడ్డి తినిపిస్తూ వాటితో ప్రేమగా గడిపారు. భారతీయ సంస్కృతిలో గోలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. పండుగ సందర్భంలో ప్రధాని గోసేవ వీడియో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది. అలాగే, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ చెప్పారు, "ఈ పండుగకు ప్రకృతితో ఉన్న ప్రత్యేక అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, సుఖసౌభాగ్యం తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. మీ కలలన్నీ సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను".











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!